Home  »  TV News  »  గుప్పెడంత మనసులో కొత్త విలన్.. రిషితో పాటుగా ఫ్యామిలీ అంతా షాక్!

Updated : Apr 27, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'గుప్పెడంత మనసు'. ఈ సీరియల్ బుధవారం నాటి ఎపిసోడ్ -747 లో.. రిషి హాల్లో కూర్చుని మినిస్టర్ అన్న మాటలు గుర్తు చేసుకుంటాడు. ఇంతలో జగతి, మహేంద్ర అక్కడికి వస్తారు. రిషి కోపంగా ఉన్నాడని చూసి.. ఇద్దరు సైలెంట్ గా లోపలికి వెళ్దామని వెళ్లబోతుంటే రిషి ఆగమంటాడు. థాంక్స్ మేడం.. మీరు నాకు చెప్పి చేసినా, చెప్పకుండా చేసినా అంతా మంచే జరిగిందని రిషి అనగానే.. జగతి సంతోషపడుతుంది. వసుధార ఎక్కడ అని రిషి అడగగానే.. బస్తీ విజిటింగ్ కి వెళ్ళిందని జగతి చెప్తుంది.

ఆ తర్వాత వసుధార ఇంటికి రాలేదని మహేంద్ర, జగతిలు కంగారుపడుతారు. రిషి కూడా వసుధార రాలేదని టెన్షన్ పడుతాడు. ఇంతలో రిషికి ఫోన్ చేస్తుంది వసుధార. సర్ వస్తున్నాను.. మీరేం టెన్షన్ పడకండని వసుధార చెప్తుంది. ఆ తర్వాత ధరణి కాఫీ తీసుకొని దేవయాని, ఫణీంద్రలకి ఇస్తుంది. అప్పుడే ఎవరో కాలింగ్ బెల్ కొట్టడంతో ధరణి వెళ్లి డోర్ తీస్తుంది. అతను ఎవరో కాదు.. శైలేంద్ర.. ధరణి భర్త. శైలేంద్ర ని చూసి ధరణి ఆశ్చర్యపోతుంది. వెంటనే అత్తయ్య అంటూ దేవయానిని పిలుస్తుంది. దేవయాని, ఫణింద్ర ఇద్దరు వచ్చి శైలేంద్రని ఇంట్లోకి ఆహ్వానిస్తారు. అప్పుడే జగతి, మహేంద్రలు వచ్చి.. శైలేంద్రతో మాట్లాడుతారు. ఆ తర్వాత రిషి వచ్చి శైలేంద్రని పలకరిస్తాడు. కానీ శైలేంద్ర మాత్రం వచ్చి చాలా సేపు అయినా కూడా ధరణిని పలకరించడు.. శైలేంద్ర బ్యాగ్ తీసుకొని గదిలోకి వెళ్లిన ధరణి.. తన కోసమే వచ్చాడని హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇంతలో ధరణి దగ్గరికి రిషి వచ్చి.. వదిన చాలా హ్యాపీగా ఉన్నట్లున్నారు. అన్నయ్య వాళ్ళు అక్కడ సరదాగా మాట్లాడుకుంటున్నారు.. రండని చెప్పి వెళ్ళిపోతాడు. మరోవైపు నీకోసం ఎన్ని రోజుల నుండి ఎదురుచూస్తుంది.. వచ్చి మంచి పని చేసావని శైలేంద్రతో ఫణీంద్ర అంటాడు..ధరణి నువ్వు కాఫీ తీసుకొని వచ్చి శైలేంద్రకి ఇవ్వు అని ఫణీంద్ర అనగానే.. ఆగు నేను నా కొడుకుకి నా చేత్తో కాఫీ తెస్తానని దేవయాని అంటుంది. అప్పుడు ఫణింద్ర అడ్డుపడి.. దేవయాని నువ్వు ఆగు. నువ్వు వెళ్లి తీసుకొని రావమ్మ ధరణి అని అంటాడు ఫణీంద్ర. ఆ తర్వాత రిషి, శైలేంద్రకి తన గది చూపించి ఫారెన్ విషయాలు అడిగి తెలుసుకుంటాడు. శైలేంద్ర కాలేజీ విషయాలు అడిగి తెలుసుకుంటాడు.

ఆ తర్వాత ధరణి కాఫీ తీసుకొని రాగానే నీ స్పెషల్ కాఫీ వచ్చిందంటూ రిషి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. శైలేంద్ర, ధరణి దగ్గరికి వస్తూ.. ఇది నా గదేనా అని అడుగుతాడు. అవునని ధరణి అంటుంది. అయితే లోపలికి వచ్చేటప్పుడు డోర్ దగ్గరికి వేసి రావాలని తెలియదా అని ధరణికి దగ్గరగా శైలేంద్ర వస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.